రాగి చంద్రోదయం!!

2018 జనవరి 31 బుధవారము చంద్రగ్రహణము తామ్ర వర్ణముతో చంద్రోదయము సంభవించనున్నది.

ఈ చంద్రగ్రహణము వీక్షించుటవలన ఎటువంటి అపాయము వుండదు. మరియు ఏ పరికరములు ఉపయోగించకుండానూ ఈ గ్రహణమును అందరూ చూడవచ్చును.

గ్రహణము చూచుటకు ముందుగా అనుకూల స్థలము చూచుకొనుట ముఖ్యము. వెన్నెల భొజనము సిద్దముచేసుకొని సాయంకాలము 6:15 గంటలకు సిద్దముగా వుండవలెను.

సంపూర్ణ చంద్రగ్రహణము సాయంకాలము 6:22 pm నుండి 7:37 pm (IST) వరకు సంభవిచనున్నది. తరువాత 2 గంటల కాలము పాక్షిక చంద్రగ్రహణము సంభవించును.

ఈ గ్రహణమునకు సంబందించిన విషయము వైజ్ఞానిక రీత్యా జరుగు మార్పులగురించి సామాన్యులకు సహితము అవగాహన కల్పించుటకు ఇది చాల ఉత్తమ అవకాశము.

ఈ గ్రహణ వీక్షణము చేయ ఆసక్తిగలవారు ఈ అవకాశమును సద్వినియోగము చేసుకొని ఇతరులకు కూడా సహాయ సహకారములు అందచేయండి.

ఇంకా ఎక్కువ విషయములకు మరియు సమాచరమునకు ఈ కింది వెబ్‍సైట్లను చూడండి

https://coppermoon18.wordpress.com

మరియు

https://www.iiap.res.in//people/personnel/pshastri/grahana/grahana.html

Advertisements